ఏపీ విభజన బిల్లుపై కోర్టు సంచలన తీర్పు !

-

ఏపీ విభజన బిల్లు చట్టబద్దంగా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదన్న కేసు పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.  జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్ విచారణ జరిపారు. ఇది రాజకీయ సమస్య కాదా, మేమెందుకు జోక్యం చేసుకోవాలి ?ఈ కేసులో ఇంకేముంది విషయం ? ఇది పార్లమెంటుకు సంబంధించిన విషయమని చెప్పింది సుప్రీం కోర్టు. ఇలాంటి రాజ్యాంగ పరమైన కేసులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించింది.

అందుకే ఈ కేసు లోపలికి వెళ్ళడం లేదని తెలిపింది. ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నాం. అప్పటి వరకు వేచి ఉండండి అని సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వాదనలు వినిపించారు. ఏపీ విభజన అశాస్త్రీయం గా జరిగిందని.. పార్లమెంటు తలుపులు మూశారు. లోక్ సభ లైవ్ కట్ చేశారు. ఎలాంటి ఓట్ల లెక్కింపు జరగలేదు అన్నారు. ఏపీ ఎంపీని నన్ను కూడా బయటికి పంపారు అని చెప్పారు. దాదాపు ఎనిమిది గంటల పాటు చర్చించాల్సిన బిల్లును అరగంటలోనే తేల్చేశారని.. సభలో ప్రధాని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news