కాకినాడ: రాబోయే విద్యా సంవత్సరం నుంచి డీగ్రీ లో యూజీసి నిబంధనల ప్రకారం మార్పులు చేస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మెయిన్ సబ్జెక్ట్ మాత్రమే చదివేలా మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. రాబోయే రోజులలో విద్యా వ్యవస్ధ లో మార్పులు తీసుకువస్తామన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా విద్యార్థులు ఆలోచించాలన్నారు బొత్స సత్యనారాయణ.
ఫౌండేషన్ స్థాయి నుంచి విద్యలో మార్పులు తీసుకురావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏపీ ఎడ్యుకేషన్ హబ్ గా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచన అని తెలిపారు. సీఎం కమిట్మెంట్ వలన భవిషత్తులో మంచి పలితాలు వస్తాయన్నారు. అట్టడుగు వర్గాలకి నాణ్యమైన విద్య అందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు బొత్స.