సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.111 కోట్లు

-

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా నమోదు అయంది. సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.111 కోట్లు వచ్చినట్లు టీటీడీ పాలక మండలి ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెల 12వ తేదీన లభించిన రూ. 5.32 కోట్లే ఈ నెలలో లభించిన అత్యధిక హుండి ఆదాయం కావడం విశేషమని టీటీడీ పాలకమండలి తెలిపింది.

నోట్ల ద్వారా 105 కోట్లు…నాణేలు ద్వారా 5.41 కోట్లు….ఉప ఆలయాలు ద్వారా 24 లక్షలు…చిరిగిన నోట్లు ద్వారా 85 లక్షలు భక్తులు సమర్పించినట్లు వివరించారు టీటీడీ పాలక మండలి అధికారులు. ఇక ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి సన్నిధిలో నిన్న ఒక్కరోజు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకేన్ లేని తిరుమల శ్రీ వారి భక్తులకు సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 79, 365 మంది భక్తులు దర్శించుకున్నారు. 25, 952 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీ వారి హుండి ఆదాయం 4.77 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news