బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు.. 21 మంది పర్యాటకుల దుర్మరణం

-

అత్యధిక వేగంతో వస్తున్న ఓ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో దాదాపు 21 మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం ఇటలీలో మంగళవారం రోజున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాదంపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘వెనిస్‌లో పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులంతా వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్‌ సైట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మాకు సమాచారం రాగానే రెస్క్యూ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాం. మృతులు, క్షతగాత్రుల్లో ఇటలీ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లుగా తెలిసింది. బస్సు అదుపుతప్పి కింద పడగానే బస్సులోని మీథేన్‌ ఇంధనం లీకై మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది’ అని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news