అరెస్టు చేస్తే పార్టీ కండువాతో ఉరి వేసుకుంటా -పరిటాల సునీత

-

అరెస్టు చేస్తే పార్టీ కండువాతో ఉరి వేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు టిడిపి నేత, మాజీ మంత్రి పరిటాల సునీత. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తే ఉరి వేసుకుంటానంటూ సునీత కండువాను మెడకు చుట్టుకున్నారు. వారించిన పోలీసులు ఆమెను బలవంతంగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

The police broke up the hunger strike of former minister Paritala Sunitha
The police broke up the hunger strike of former minister Paritala Sunitha

అయినప్పటికీ ప్రభుత్వాస్పత్రిలో కూడా మాజీ మంత్రి పరిటాల సునీత తన దీక్షను కొనసాగిస్తున్నారు. చంద్రబాబును వదిలివేయాలని డిమాండ్ చేశారు. కాగా,  చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని.. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు అసదుద్దీన్. సీఎం జగన్ పాలన మంచిగానే ఉందని చెప్పిన అసదుద్దీన్ చంద్రబాబును మాత్రం నమ్మలేమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news