ఏపీ టీచర్లకు గుడ్‌ న్యూస్‌..నేటి నుంచి బదిలీల ప్రక్రియ

-

ఏపీ టీచర్లకు గుడ్‌ న్యూస్‌.నేటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీ ప్రక్రియ మొదలుకానుంది. 6,249 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 679 MEO పోస్టులను హెడ్ మాస్టర్ లతో భర్తీ చేస్తారు. తోలుత సీనియర్లను బదిలీ చేసిన అనంతరం పదోన్నతులు కల్పిస్తారు.

టీచర్ల బదిలీకి 8 ఏళ్లు, హెడ్ మాస్టర్లకు 5 ఏళ్ల సర్వీస్ పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ పూర్తి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. కాగా, APలో ఎండల తీవ్రత నేపథ్యంలో వైద్య విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బాబ్జి అన్ని మెడికల్ కాలేజీలను ఆదేశించారు. 10 నుంచి 15 రోజులు హాలిడేస్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ లో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version