ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి.. వారే సరైన లీడర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో వాలంటీర్ల అభినందన సభలో మాట్లాడారు. జగన్ లా బటన్ నొక్కితే శ్రీలంక పరిస్థితి అవుతుందన్నారు చంద్రబాబు. ఇప్పుడేమో మళ్లీ 6 గ్యారెంటీలు అంటున్నాడు. చంద్రబాబు హైదరాబాద్ లోని తన ఇంట్లో కూర్చుంటారు. పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టో తెప్పించుకుంటారు. అందులోంచి కిచిడీని తయారు చేస్తారని పేర్కొన్నారు.
బాబుకు ఓటు వేయడం అంటే మన పిల్లల బంగారు భవిష్యత్ ను తాకట్టు పెట్టడమే అని స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలు నమ్మితే బంగారు కడియం ఇస్తామన్న పులి కథే మిగులుతుందన్నారు. వాలంటీర్లు కాబోయే లీడర్లు అన్నారు. చంద్రబాబు వస్తాడు.. చంద్రముఖీలు వస్తాయి. చొక్కా చేతులు మడచాల్సిన సమయం వచ్చింది. బాబుకు ఓటు వేయడమే అంటే.. ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖీని మళ్లీ ఇంటికి తీసుకురావడమే అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే.. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలు అన్నీ కూడా రద్దు అవుతాయని పేర్కొన్నారు సీఎం జగన్.