పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర రెండవ షెడ్యూల్ ఖరారు

-

ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం మంగళగిరి నుంచి ఏలూరు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఏలూరు సమీపంలోని క్రాంతి కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ బస చేస్తారు. రేపు సాయంత్రం 5:00 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇక సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశమై సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు. ఇక 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version