గ్రేటర్ నొయిడా స్టేడియం పై అప్గనిస్తాన్ అసంతృప్తి..!

-

సెప్టెంబర్ 9-13 మధ్య అప్గానిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఏకైక టెస్ట్ మ్యాచ్ లో తలపడాల్సి ఉంది. ఆతిథ్య జట్టు అయిన అప్గాన్ ఈ మ్యాచ్ కు వేదికగా భారత్ లోని గ్రేటర్ నోయిడాను ఎంచుకుంది. షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. మైదానం చిత్తడిగా ఉండటంతో టాస్ పడకుండానే తొలి రోజు ఆట రద్దయింది. మ్యాచ్ నిర్వహణ సాధ్యమవుతుందా..? లేదా అని తెలుసుకునేందుకు ఆంపైర్లు ఆరుసార్లు గ్రౌండ్ ను పరిశీలించారు.

చివరకు సాయంత్రం నాలుగు గంటలకు మొదటి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సోమవారం స్టేడియం ఉన్న ప్రాంతంలో వర్షం కురవలేదు. అంతకు ముందు కురిసిన వర్షాలకు మైదానం పూర్తిగా తడిసిపోయి చిత్తడిగా మారింది. నీటిని మల్లించడానికి స్టేడియంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన సౌకర్యాలు లేవు. దీంతో ఔట్ ఫీల్డ్ చాలా తడిగా ఉంది. రెండో రోజు కూడా పిచ్ పరిస్తితిలో మార్పు లేదు. ఇవాల కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news