మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్లు మాట్లాడాల్సిన అవసరం లేదు – మంత్రి అప్పలరాజు

-

మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్లు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కి బయ్యారం గనులు ఇవ్వమని అడిగితే గతంలో తెలంగాణ వాళ్లు వ్యతిరేకించారని అన్నారు. తెలంగాణలో ఉనికి కోసం బిఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటానని హైప్ చేసిందని ఘాటు విమర్శలు చేశారు.

ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సవాల్ విసిరారు అప్పలరాజు. ఎంపీ లాడ్స్ నుంచి పలాస రైల్వే స్టేషన్ లో స్టీల్ కుర్చీలు మాత్రమే వేసిన రామ్మోహన్ నాయుడు అభివృద్ధి గురించి మాట్లాడతారా..? అని మండిపడ్డారు. అసలు చంద్రబాబు, లోకేష్ లకు ఏపీలో చిరునామా ఉందా..? అని ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క హార్బర్ నిర్మాణం కూడా జరగలేదని అన్నారు. కనీసం శంకుస్థాపన అయినా చేశారని నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version