బండి ఎలక్షన్ టీం రెడీ..ఆ నేతలకు షాక్ తప్పదా?

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం కూడా లేదు. దీంతో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రెడీ చేస్తున్నాయి. తమ ఎలక్షన్ టీంలని రెడీ చేస్తున్నాయి. ఇదే క్రమంలో బి‌జే‌పి సైతం ఎలక్షన్ టీమ్‌ని రెడీ చేసే పనిలో ఉంది. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బి‌జే‌పి చూస్తున్న విషయం తెలిసిందే. కే‌సి‌ఆర్ ని గద్దె దించాలని తెగ ట్రై చేస్తున్నారు.

ఇక కేంద్రం పెద్దలు సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బి‌జే‌పి ఎలక్షన్ టీం రెడీ చేస్తున్నారు. బిజెపి సంస్థాగతంగా మార్పులు చేయడానికి రంగంలోకి దిగింది. బీజేపీలో రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధాన కార్యదర్శులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, శివప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్‌లు సమావేశమయ్యారు. గత కొద్దిరోజులుగా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులపై బీజేపీలో చర్చ జరుగుతోంది.

 

పనితీరును బట్టి బాధ్యులను మార్చాలని బిజెపి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. అయితే కొందరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నేతలు జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో విఫలమైనట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త టీంలో ఎవరెవరు ఉండాలన్న దానిపై ఇప్పటికే ఇంచార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను జాతీయ నాయకత్వం సేకరించింది. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులపై దృష్టి సారించారు.

దాదాపు 20 జిల్లాల అధ్యక్షులని మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. టోటల్ గా పార్టీని ప్రక్షాళన చేసి..ఎన్నికల టీంతో రంగంలోకి వెళ్లాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version