ఆంధ్రప్రదేశ్ లో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగనుండటంతో ఈ ఫలితాలను జూన్ 04న విడుదల చేయనున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఎవ్వరూ విజయం సాధిస్తారని చర్చ జరుగుతోంది.
ఈ తరుణంలో ఎవ్వరికీ వారు గెలుపు ధీమాలో ఉన్నారు. తాజాగా వైసీపీకి వచ్చే సీట్ల పై రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. జూన్ 04న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల్లో ఏపీ సీఎం జగన్ ఆశలు ఆవిరి అవుతాయన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీ వేంకటేశ్వరుడిని కోరుకున్నట్టు తెలిపారు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.