తిరుమ‌ల భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ : దర్శ‌నం టికెట్లు నేడు, రేపు విడుద‌ల

తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వారి భ‌క్తుల‌ను టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వారి ద‌ర్శనానికి కావాల్సిన టికెట్లను ఈ నెల 23, 24 తేదీల‌లో ఆన్ లైన్ లో టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. రాబోయే ఏడాది జ‌న‌వరి నెల కు సంబంధించిన టికెట్ల‌ను ఆన్ లైన్ ద్వారా విక్ర‌యించ‌నున్నారు. రోజుకు 20 వేల చొప్పున మొత్తం 6 ల‌క్ష‌ల 20 వేల టికెట్ల‌ను విడుదల చేస్తామ‌ని టీటీడీ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు సేవా ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే రేపు రూ. 300 ల‌తో ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేయ‌నున్నారు.

tirupathi balaji

రేపు ఉద‌యం 9 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి నెలకు సంబంధించి 1, 2, 13 నుంచి 22, 26 తేదీల టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రోజుకు 20 వేల టికెట్ల అందుబాటులో ఉంటాయ‌ని టీటీడీ అధికారులు తెలిపారు. జ‌న‌వ‌రి 1, 2 ల‌లో కొత్త సంవ‌త్స‌రం దృష్ట్య రోజుకు 8000 టికెట్ల‌ను ఎక్కువ గా ఇస్తారు. అలాగే జ‌న‌వ‌రి 2 నుంచి 12, 23, నుంచి 31 తేదీల రోజుకు 12 వేల చోప్పున టికెట్ల అందుబాటు లో ఉంటాయి. అలాగే ఈ నెల 27 నుంచి తిరుమ‌ల‌లో వ‌స‌తి గ‌దులకు సంబంధించిన బుకింగ్ లు అందుబాటు లో ఉంటాయి. జ‌న‌వ‌రి 11 నుంచి 14 వ‌ర‌కు వ‌సతి గదుల బుకింగ్స్ చేసుకోవాల‌ని సూచించారు. మ‌రిన్నీ వివ‌రాల‌కు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను సంప్ర‌దించాల‌ని సూచించారు.