ఓమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ కిస్మస్, న్యూఇయర్ వేడుకులపై ఆంక్షలు…

ఓమిక్రాన్ వేరియంట్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఓమిక్రాన్ భయాల వల్ల అన్ని రాష్ట్రాలు ఆంక్షల ఛట్రంలోకి వెళుతున్నాయి. ముఖ్యంగా న్యూఇయర్, క్రిస్మస్ సెలబ్రేషన్లపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం వీటిపై ఆంక్షలు విధించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఓమిక్రాన్, కరోనా భయాలతో ఆంక్షలు విధించనుంది. ముఖ్యంగా న్యూఇయర్, క్రిస్మస్ వేడుకల్లో ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగ వేడుకలపై నిషేధం విధించింది.

new year

 

దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఢిల్లీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఓమిక్రాన్ కేసుల విషయంలో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పటికే అక్కడ 57 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్ని రెస్టారెంట్లు మరియు బార్‌లు సీటింగ్ కెపాసిటీ 50 శాతం వరకు, ఆడిటోరియంలు,అసెంబ్లీ హాళ్లు సీటింగ్ కెపాసిటీలో 50% వరకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లు, బస్సుల్లో 100 శాతం వరకు అనుమతించినప్పటికీ.. స్టాండింగ్ ప్యాసింజర్లను మాత్రం 30 శాతం వరకే ఉండాలని ఆంక్షలు విధించింది.