అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుందుర్పి మండలoలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఇవాళ ఉదయం తెరపైకి వచ్చింది. మృతులను గంగన్న, శ్రీదేవి, సంధ్యలుగా గుర్తించారు.. వీళ్లు ఒకే కుటుంబానికి చెందిన వారు అని స్థానికులు చెబుతున్నారు.
భారీ వర్షాల కారణంగా ఈ పాత మిద్దె కూలిందని సమాచారం అందుతోంది. ఈ ఘటనతో కుందుర్పి మండలoలోని రుద్రంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు. అటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు. పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.