నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి.. ఉలిక్కిపడ్డ స్థానిక ప్రజలు

-

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో కారుపై దాడి చేయడం ఇప్పుడు స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లె సమీపంలోని నెల్లూరు – ముంబయి హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్దపులి దాడి చేయడంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే కారు దిగి సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. ఎలాగోలా పెద్దపులి కంటబడకుండా ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. రాత్రి సమయంలో బయటకు రాకూడదని చెప్పారు. వీలైనంత త్వరగా పెద్దపులి ఆనవాళ్లు కనిపెడతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news