తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నిన్న అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేశారు తిరుమల శ్రీవారి అర్చకులు. ఇక ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ పాలక మండలి. నేటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 63,358 మంది భక్తులు.. దర్శించుకున్నారు. ఇక తిరుమల దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 19,534 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లుగా నమోదు అయింది. కాగా, గతేడాదే శ్రీ వారిని 2.52 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో రూ. 1,398 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. ప్రతి నెల హుండీ ఆదాయం రూ. 100 కోట్ల మార్కును దాటడం గమనార్హం. జూలైలో అత్యధికంగా రూ. 129 కోట్లు రాగా…. నవంబర్ లో అత్యల్పంగా రూ. 108 కోట్లు చేకూరాయి. మరోవైపు నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనం ముగిసింది.