తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ఠ్. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 31 కంపార్టుమెంట్లు లో భక్తులు ఉన్నారు. తిరుమలలో నిన్న శ్రీవారిని 82,580 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమలలో శ్రీవారికి 31,905 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.0 కోట్లుగా నమోదు అయింది. కాగా, శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను నిండా ముంచారు దళారీలు. టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీ నని చెప్పి భక్తురాలిని మోసగించిన కేటుగాళ్లపై కేసు నమోదు అయింది. ఏప్రిల్ మాసంలో సుప్రభాతం, బ్రేక్ దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయని భారీ మొత్తంలో నగదు తీసుకున్నారట దళారీ. అయితే.. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది.