గచ్చిబౌలిలో దారుణం..వీడియోలు తీసి బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడి !

-

గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలిక ను వేధించాడు మైనర్ బాలుడు. ప్రేమను నిరాకరించడంతో.. మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధించాడు. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని మరో మైనర్ వీడియో రికార్డ్ చేశాడు. వీడియో చూపించి బాలికను లైంగికంగా వేధించాడు రెండో మైనర్. ఈ తరుణంలోనే… ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది.. మైనర్ మొబైల్ ఫోన్ పగలగొట్టింది బాలిక.

Atrocity in Gachibowli Three minors sexually assaulted a girl and made videos

ఇద్దరూ గొడవ పడుతుండగా చూశాడు మూడో మైనర్. ఈ విషయం అందరికీ చెప్తానని బాలిక కు మూడో మైనర్ కూడా వేధింపులకు గురి చేశాడు. ఇలా కొన్ని రోజులుగా బాలికను వేధించి.. రేప్‌ చేస్తున్నారట ముగ్గురు మైనర్లు. ఈ విషయం తెలుసుకున్న బాలిక స్నేహితులు.. ఆ బాలిక పేరెంట్స్ కి సమాచారం అందించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పేరెంట్స్. దీంతో ముగ్గురు మైనర్ల పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version