తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం నేరుగా జరుగుతోంది. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఇక తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 69,333 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారికి నిన్న ఒక్క రోజే 22,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా నమోదు అయింది.
ఇది ఇలా ఉండగా… తిరుమల శ్రీవారి సన్నిధిలో నవంబర్ 13వ తేదిన కైశిక ద్వాదశి ఆస్థానం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వేకువజామున మాడవీధులలో ఉరేగునున్నారు ఉగ్ర శ్రీనివాసమూర్తి. అలాగే… సూర్యోదయం లోపు మాడవీధులలో ఉగ్రశ్రీనివాసమూర్తి ఉరేగునున్నారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఆలయం వెలుపలికి రానున్నారు ఉగ్రశ్రీనివాసమూర్త. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.