తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ఠ్. తిరుమలలో సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. దీంతో టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 82043 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.

30100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే హుండి ఆదాయం 4.1 కోట్లుగా నమోదు అయింది.
తిరుమల….బ్రహ్మోత్సవాలలో ఆరోవ రోజు
ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
రాత్రి 7 గంటలకు గజవాహనం భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి