ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌తో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్లు

-

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఇక నుంచి భక్తులు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి పొందేందకు వీలుగా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన భక్తులకు టికెట్లు జారీ కాగానే నేరుగా వారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ లింక్‌ పంపుతున్నారు. భక్తులు దానిపై క్లిక్‌ చేసి పేమెంట్‌ గేట్‌వే ద్వారా నగదు చెల్లిస్తే బ్రేక్‌ దర్శన టికెట్‌ను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలా అనంతరం టికెట్‌ను ప్రింట్‌ తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.

గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లకు వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన అనంతరం సాయంత్రం ఎంబీసీ 34లో నగదు లేదా యూపీఐ, కార్డ్‌ ద్వారా చెల్లింపులు చేసి టికెట్‌ పొందేవారన్న సంగతి తెలిసిందే. దీనివల్ల భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వచ్చేది. తాజాగా టీటీడీ తీసుకువచ్చిన సేవలతో భక్తులకు గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం తప్పినట్టేనని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version