2029లో మళ్ళీ జగన్ ని సీఎం చేసుకుంటాం : టీజేఆర్ సుధాకర్ ‌

-

జగన్‌తో అనుబంధ సంఘాల నేతల సమావేశం జరిగింది. బూత్ లెవల్ నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్ఠం చేయాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువవుతాం. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాలపై దండెత్తుతాం అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ ‌బాబు అన్నారు. బాధ్యతలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా పార్టీ నిర్మాణం చేస్తాం.

ప్రజలకు అండగా నిలపడతాం. అన్ని స్థాయిల్లోనూ కార్యవర్గాలను నియమిస్తాం. అందరికీ ఐడీ కార్డులు కూడా ఇస్తాం. ఎవరెవరు ఎలా పని చేస్తున్నదీ సమీక్షలు చేస్తాం. చెదిరిపోయిన వాలంటీర్లను సమీకరిస్తాం. ఇక ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో పని చేస్తాం. 2029లో మళ్ళీ జగన్ ని సీఎం చేసుకుంటాం. కమిటీ నిర్మాణాల అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభిస్తాం. 16, 17న వర్క్‌షాప్ నిర్వహిస్తాం. జిల్లా అధ్యక్షులతో కలిసి అన్ని విభాగాల నేతలు ఈ వర్క్‌షాపునకు హాజరవుతారు అని టీజేఆర్ సుధాకర్ ‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version