ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బ్రేక్ పడింది. అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజులుగా ఈ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర కు విరామం ప్రకటించారు.

నెల్లూరు రూరల్ మండలం చింతరెడ్డి పాలెం లో జగన్మోహన్ రెడ్డి బస చేశారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇవాళ విరామం ప్రకటించారు. రేపు కావలిలో జరిగే బహిరంగ సభకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. అలాగే ఎప్పటిలాగే రేపు కూడా బస్సు యాత్ర కొనసాగనంది.