ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో 71 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. దీనితో ఇప్పటి వరకు ఏపీలో 1,403కి చేరాయి. ఇప్పటి వరకు 321 మంది డిశ్చార్జి అయ్యారు. 31 మంది కరోనా తో మరణించగా 1051 మంది కరోనా తో చికిత్స పొందుతున్నారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 43 కేసులు కేసులు కృష్ణా జిల్లాలో 10 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు కడప జిల్లాల్లో 4 కేసులు చొప్పున నమోదు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇపటి వరకు కర్నూలు జిల్లాలో 386 కరోనా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 287 కరోనా కేసులు కృష్ణా జిల్లాలో 248 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో కరోనా అత్యంత భయంకరంగా ఉంది. నెల్లూరు 84, చిత్తూరు 80 కేసులు నమోదు అయ్యాయి.