AP: ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలకి బానిసైన భర్త కారణంగా.. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలోని గోపాలపట్నంలో విషాదం జరిగింది. భర్త పోర్న్ వీడియోలకి బానిసయ్యాడని మనస్తాపంతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. 11 నెలల కిందట నాగేంద్రబాబుని పెళ్లి చేసుకుంది వసంత.

అయితే… పోర్న్ వీడియోలలో చేసినట్టు చేయాలంటూ భార్య వసంతపై భర్త ఒత్తిడి తెచ్చాడట. ఈ తరుణంలోనే… మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది వసంత. ఇక ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఈ సంఘటన కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు గోపాలపట్నం పోలీసులు. ఇక పోర్న్ వీడియోలకి బానిసైన భర్త కారణంగా.. నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
పోర్న్ వీడియోలకి బానిసైన భర్త.. నవ వధువు ఆత్మహత్య
విశాఖలోని గోపాలపట్నంలో విషాదం
భర్త పోర్న్ వీడియోలకి బానిసయ్యాడని మనస్తాపంతో నవ వధువు ఆత్మహత్య
11 నెలల కిందట నాగేంద్రబాబుని పెళ్లి చేసుకున్న వసంత
పోర్న్ వీడియోలలో చేసినట్టు చేయాలంటూ భార్య వసంతపై భర్త ఒత్తిడి
మానసిక ఒత్తిడికి… pic.twitter.com/Px1JuOUHai
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025