నెల్లూరులో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజీ లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లింది కాలేజీ యాజమాన్యం.

హేమశ్రీకి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్పించినట్టుగా తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం అందించారట. బాధిత కుటుంబ సభ్యులు కాలేజ్ దగ్గరకు వచ్చి గట్టిగా నిలదీయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చిందట.. విద్యార్థి నాయకులతో కలిసి ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, బంధువులు… రచ్చ రచ్చ చేస్తున్నారు.