పిల్లలకు తల్లి తెలివితేటలు మాత్రమే వస్తాయట.. కారణం చెబుతున్న అధ్యయనం

-

పిల్లలకు తల్లితండ్రుల పోలికలు వస్తాయి అని అందరికి తెలుసు..తల్లి లేదా తండ్రిలానే వారి ముఖం కూడా ఉంటుంది. అలాగే వారి బుద్ధులు కూడా వస్తాయి. కానీ తెలివితేటలకు తల్లిదండ్రులకు సంబంధం ఉంటుందని మీకు తెలుసా..? ముఖ్యంగా పిల్లలకు తల్లి తెలివితేటలు మాత్రమే వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే తల్లి ఎంత తెలివైనది అయితే.. ఆమెకు పుట్టిన బిడ్డ కూడా అంతే తెలివిగా ఉంటాడు.. ఒకవేళ తల్లికి ఐక్యూ తక్కువగా ఉండి, తండ్రి విపరీతంగా తెలివైన వాడైనా సరే.. వాళ్లకు పుట్టిన బిడ్డకు ఆ తండ్రి తెలివితేటలు రావు, తల్లి ఐక్యూలానే ఆ బిడ్డ ఐక్యూ ఉంటుందట. అధ్యయనం ఏం చెప్తుందంటే..

ఇటీవలి అధ్యయనం ప్రకారం, పిల్లల తలలో ఏర్పడే తెలివితేటలు తల్లి నుండి వస్తాయి, తండ్రి నుండి కాదు అని తేలింది. యునైటెడ్ స్టేట్స్‌లో మొత్తం 12,000 మందిని సర్వే చేశారు. 1 నుండి 22 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అక్కడ పాల్గొన్నారు. వారిని వివిధ విషయాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకున్నారు. వివిధ పరీక్షలు కూడా నిర్వహించారు.. దీనిపై ప్రత్యేక సమాచారం వెలువడింది. తల్లి ప్రవర్తన, వ్యక్తిత్వం, తెలివితేటలు పిల్లలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. పిల్లల IQ తల్లిదండ్రులిద్దరి నుండి వస్తుంది. మానవుని X క్రోమోజోమ్‌పై ఎంతో మేధస్సు అభివృద్ధి చెందుతుంది. అందుకే తల్లి వల్ల పిల్లలు బుద్ధిమంతులు అవుతారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అయినప్పటికీ, సరైన ఆహారం పిల్లల శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మేధస్సును అభివృద్ధి చేయడానికి పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బచ్చలికూరను క్రమం తప్పకుండా తినిపించండి. ఇందులో విటమిన్ కె, లుటిన్, ఫోలేట్ మరియు బీటా కెరోటిన్ ఉంటాయి. ధాన్యాలు తినిపించండి. ఉదాహరణకు, గోధుమలు, బార్లీ, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, లిన్సీడ్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మేధస్సును అభివృద్ధి చేస్తుంది. ఓట్స్, చేపలు, గుడ్లు, అవకాడోలు మరియు డార్క్ చాక్లెట్ కూడా మేధస్సును పెంచడంలో సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news