BREAKING: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత నీటికి ముగ్గురు దుర్మరణం చెందారు. విజయవాడలోని మొగల్రాజపురం పటమటవారి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి ఇప్పటి వరకూ 26 మంది అస్వస్ధతకు గురయ్యారు. అటు వీరి కోసమే ప్రభుత్వాసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. నీరు తాగితే విరేచనాలు అవుతున్నాయంటున్నారు స్ధానికులు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రభుత్వం యంత్రాంగం. 34 సంవత్సరాల క్రితం వేసిన పైపుల కారణంగా నీటి కష్టాలు అంటున్నారు. కంప్లైంట్ ఇచ్చినా సరైన పరిష్కారం చేయలేదంటున్నారు స్ధానికులు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించడంతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం కదిలొచ్చింది.. ఆదరాబాదరాగా టెస్టులు చేయడం మొదలెట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.