TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ కీలక నిర్ణయం

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులతో పాటు టీఎస్పీఎస్సీలో పలువురు ఉద్యోగులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలని భావిస్తోంది సిట్.

సెక్రెటరీ అనితా రామచంద్రన్ , సభ్యుడు లింగారెడ్డి లను విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్…
ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్ ముందు తెలిపారు సెక్రెటరి అనిత రామ్ చంద్రన్. ప్రవీణ్ డిస్ క్వాలిఫై కావడంతో అతడి మీద అనుమానం రాలేదన్నారు సెక్రెటరీ. తన పి ఏ రమేష్ గ్రూప్ 1 రాసినట్టు తనకు తెలియదని వివరించారు లింగారెడ్డి. అనిత రామ్ చంద్రన్ & లింగా రెడ్డిలను వేరు వేరుగా రెండు గంటల పాటు విచారించిన సిట్… పరీక్షల నిర్వహణ , కాన్ఫిడేన్షియల్ పై మొత్తం వివరాలు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news