TTD cautions pilgrims on waiting time for darshan: తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో కుటుంబంతో కలిసి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా రద్దీ నెలకొంటుంది. దీంతో స్వామి వారి దర్శనానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,744 మంది భక్తులు కాగా.. 36, 833 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లుగా నమోదు అయింది.
తిరుమల..31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 16 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81744 మంది భక్తులు
తలనీలాలు సమర్పిం చిన 36833 మంది భక్తులు
హుండి ఆదాయం 3.34 కోట్లు