ఇవాళ శ్రీవాణి ట్రస్టుపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులపై విశ్వహిందూ పరిషత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నమయ్య భవనంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు,పీఠాధిపతులతో ఈవో ధర్మారెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై వస్తోన్న ఆరోపణలను ఖండించారు పీఠాధిపతులు,స్వామిజీలు. శ్రీవాణి ట్రస్టు నిధులు సద్వియోగం అవుతుందని పీఠాధిపతులు పేర్కొన్నారు.
శ్రీవాణి ట్రస్టు నిధులతో పలు ఆలయాల నిర్మాణం,పురాతన ఆలయాల పున:రుద్దరణ టీటీడీ చేపట్టిందని..శ్రీవాణి ట్రస్టుపై బురద చల్లే కార్యక్రమ చేస్తున్నారన్నారు. ఆదాయ పన్ను సెక్షన్ 12A ఆదాయపు పన్ను కమిషనర్ ద్వారా శ్రీవాణి ట్రస్టుకు రిజిస్ట్రేషన్ లభించిందని.. శ్రీవాణి ట్రస్టు ఆన్ లైన్ ద్వారా 475.57 కోట్లు వచ్చిందని చెప్పారు. ఆఫ్ లైన్ ద్వారా 350.82 కోట్లు ఆదాయం వచ్చిందని పీఠాధిపతులు పేర్కొన్నారు. ఇవాళ శ్రీవాణి ట్రస్టుపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ధర్మారెడ్డి. అమరావతిలో 150 కోట్ల రూపాయలతో ఆలయం నిర్మించడం కోసం శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేస్తారమని.. గత ప్రభుత్వ టీటీడీ పాలకమండలి ఈ శ్రీవాణి ట్రస్టును ప్రారంభించారని గుర్తు చేశారు.