దశాబ్ది ఉత్సవాలు కాదు.. కచ్చితంగా దశాబ్ది దగా : రేవంత్‌ రెడ్డి

-

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దశాబ్ది దగా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తమ నాయకుల అరెస్టు అప్రజాస్వామికమని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల పేరిట కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా దశాబ్ది దగానేనని స్పష్టం చేశారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని అయినా పూర్తిగా అమలు చేశారా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఇచ్చినవి అమలు చేయకుండా మోసంచేసిన హామీల గురించే ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రతిపక్షపార్టీగా ప్రజాసమస్యలపైపోరాడే హక్కు ఉందన్న రేవంత్‌ రెడ్డి…అరెస్టుచేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి ఉద్యమాన్ని ఆపలేరని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజల హక్కులను కాలరాసే విధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్‌స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news