ఏపీలోని ఆ నగరాలకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో ఇవాళ కార్తీక దీపోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. దీపోత్సవం ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
పవిత్రమైన కార్తీక మాసంలో నవంబర్ 20న తిరుపతిలో, నవంబర్ 27న కర్నూలులో, డిసెంబర్ 11న వైజాగ్ లో దీపోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా శివ కేశవుల వైశిష్ఠ్యం, మహిళలకు దీపం ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు 2021వ సంవత్సరం నుంచి టీటీడీ ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
ఇది ఇలా ఉండగా… తిరుమలలో 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక నిన్న ఒక్క రోజే టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పట్టింది. అటు 79,800 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే 25,962 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లుగా నమోదు అయింది.