బాధపడొద్దు …. “టీమిండియా ఛాంపియన్సే”: గౌతమ్ గంభీర్

-

నిన్న రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా దారుణంగా 6 వికెట్ల తేడాతో ఓడిపోయి కప్ ను చేజార్చుకుంది. ఈ విధమైన ఫలితం వస్తుందని సగటు ప్రేక్షకుడు కూడా ఊహించలేదు. కానీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కప్ ను గెలుచుకున్న టీం ఇండియా మూడవ సారి గెలవాలన్న ఆశ ఉంది కానీ, కసి లేకపోవడంతో ఓటమి పాలయింది. తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇండియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు. వరల్డ్ కప్ లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం మాములు విషయం కాదు. కాబట్టి ఎవ్వరూ బాధపడకండి టీం ఇండియా ఛాంపియన్ అంటూ మద్దతుగా మాట్లాడాడు గంభీర్. మాములుగా ఇండియా ప్రదర్శనను ఉన్నదీ ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడే గంభీర్ ఈ విధంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇక ఆరవసారి వరల్డ్ కప్ టైటిల్ ను అందుకున్న ఆస్ట్రేలియాను గౌతమ్ గంభీర్ అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news