భక్తులకి షాక్ ఇచ్చిన టీటీడీ.. భారీగా తరలివస్తోండడంతో !

-

భక్తులకి టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమల కల్యాణోత్సవ ఆన్ లైన్ టిక్కెట్ల కోటా మీద టీటీడీ సీలింగ్ విధించింది. గత కొద్దీ రోజులుగా నిత్యం వేల సంఖ్యలో భక్తులు టిక్కెట్లను కొనుగోలు చేశారు. మరీ ముఖ్యంగా అక్టోబర్ 3వ తేదీన అయితే రికార్డు స్థాయిలో 4300 టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేశారు. కళ్యాణోత్సవ సేవలో భక్తులు ఆన్ లైన్‌లో పాల్గొనేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభమవుతుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లు కలిగిన భక్తులకు అర్చకులు వీడియో కాలింగ్ ద్వారా సంకల్పం చెప్పిస్తారు.

ttd
ttd

ఇక అనంతరం వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తులకు పంపేలా దీనిని రూపొందించారు. ఈ టికెట్ తో ఒకసారి శ్రీవారిని కూడా దర్శించుకోవచ్చు. దీంతో ఈ వెసులు బాటు ఉండడంతో ఈ టికెట్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. గత శని, ఆదివారాలలో కల్యాణోత్సవ సేవా టిక్కెట్ల పై శ్రీవారిని 16వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం రోజుకు 1000 కల్యాణోత్సవ టిక్కెట్లను మాత్రమే జారీ చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. సీలింగ్ విధించడంతో ఈ నెల 15 వ తేదీ వరకు టిక్కెట్లు విక్రయాలు పూర్తయినటు అయింది. ఇక ఈ నెల 16వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు నేపథ్యంలో కల్యాణోత్సవ సేవ 10 రోజుల పాటు రద్దు చేశారు. 26వ తేదీ నుంచి కల్యాణోత్సవ సేవా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news