తిరుమల భక్తులకు శుభవార్త..జనవరి 9న ఆఫ్ లైన్ లో టిక్కెట్లు కేటాయించనున్నారు. జనవరి 9వ తేది ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు ఆఫ్ లైన్ విధానంలో కేటాయించనుంది టిటిడి పాలక మండలి. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది.
ఈ తరుణంలోనే… రోజుకి 40 వేల చోప్పున సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేయనున్నారు. 10,11,12వ తేదీలకు సంబంధించిన లక్షా 20 వేల టిక్కెట్లును 9వ తేదీన కేటాయించినుంది టిటిడి పాలక మండలి. మిగిలిన రోజులుకు సంబంధించి ముందు రోజు టిక్కెట్లు కేటాయింపులు ఉంటాయి. తిరుపతిలో 8 ప్రాంతాల్లో,తిరుమలలో 1 ప్రాంతంలో ఏర్పాటు చేసిన 91 కేంద్రాలు ద్వారా టిక్కెట్లు కేటాయింపులు చేస్తారు టీటీడీ అధికారులు. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.