ఇవాళ రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దల సమావేశం…!

-

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిగ్‌ డే కానుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ఉండనుంది. సంధ్య థియేటర్ ఘటన అనంతరం పరిణామాల నేపథ్యంలో ఉత్కంఠగా మారింది సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ఉండనుంది.

Today, Revanth Reddy’s meeting of Tollywood elders

అయితే ఇవాళ ఉదయం జరగనున్న ఈ భేటీ లో చిరంజీవి, వెంకటేష్, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ వివాదం, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లపై ప్రధానంగా చర్చ సాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కాకుండా.. పోలీసులకు సంబంధించిన అధికారిక భవనంలో సినీ ప్రముఖుల భేటీ ఉండనుంది. అటు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో  పాటు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి లాంటి మంత్రులు కూడా పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news