తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు..దింతో టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది.

70,372 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 24,463 మంది భక్తులు..నిన్న తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.25 కోట్లుగా నమోదు ఐంది.
ఇది ఇలా ఉండగా , AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అంటే శుక్రవారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం టీటీడీ గోశాలను పరిశీలించనున్నారు. ఈ మేరకు గోశాలకు వెళ్లి గోవుల మృతి అంశంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.