ముచ్చుమర్రి 3వ తరగతి బాలిక కేసులో మరో ట్విస్ట్..తల్లితండ్రులే బండరాయి కట్టి!

-

ముచ్చుమర్రి 3వ తరగతి బాలిక కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 3వ తరగతి చదువుతున్న బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురే.. సెల్ ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గొంతు నులిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో పడేసారూ నిందితుల తల్లితండ్రులు.

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజు సింగ్ రానా తెలిపారు. మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు అన్నారు.

వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్ తో మోటర్ వాహనంతో అమ్మయిని తీసుకువెళ్లారని, ఆ ముగ్గురు పిల్లలలో ఒక బాలుడి తండ్రి, మరో బాలుడి పెదనాన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వారి సమాచారం మేరకు SDRF, NDRF, బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని అమ్మాయిలు డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version