కడపలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

-

కడప జిల్లా సిద్ధవటంలో.. ఇద్దరు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసారు పోలీసులు. అనంతరం సిద్ధవటం సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి వివరాలు వెల్లడించారు. కడప భాకరాపేట రోడ్డు మార్గాన పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా దొంగలను పట్టుకున్నారు. కడప జిల్లా అట్లూరు మండలము కుమ్మరి కొట్టాలకు చెందిన గుమ్మాల వెంకట సుబ్బయ్య, అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అత్తిరాల కు చెందిన అమర్ రాజ్ కుమార్ లు పోలీసుల అదుపులో ఉన్నారు.

అయితే పట్టు బడిన వారు మాధవరం గ్రామంలో జరిగిన రాత్రిపూట ఇంటి కన్నం వేసిన నేరములో ముద్దాయిలు గా గుర్తించారు పోలీసులు. వీరిద్దరిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ లల్లో కేసుల నమోదు అయ్యినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సిద్ధవటం, కలవాయి, ఓడిసి కేసులలో భాగంగా 6 లక్షల 72 వేల విలువగల 96 గ్రాముల బంగారు ఆభరణములు, AP26-BC-7988 నెంబర్ గల అపాచీ మోటార్ సైకిల్ రికవరీ చేసారు. ప్రస్తుతం ముద్దాయిలను సిద్ధపటం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version