నంద్యాల వన్ టౌన్ పోలీసుల వేధింపులు భరించలేక చిన్నా అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనగా మారింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు యువకుడు చిన్నా. గతంలో మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసి, ప్రస్తుతం కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు చిన్నా. 20 రోజుల క్రితం బైక్ చోరీ కేసులో చిన్నాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు ఎస్సై సుబ్బరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నాగన్న , ఏసుదాసు.
సి.సి. ఫుటేజ్ లో దొంగతనం చేసినట్లు ఉందని, బైక్ ను అప్పగించమని యువకుడిని చితకబాదారు ఎస్సై సుబ్బరామిరెడ్డి, కానిస్టేబుళ్లు. దీంతో మహానంది మండలం గోపవరం వరకు నడుచుకుంటూ వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చిన్నా. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని, తనను పోలీసులు చితకబాదారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ తనని దొంగలా చూస్తున్నారనే అవమానం భరించలేకనే ఆత్మ చేసుకుంటున్నానని ఆ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు చిన్నా.