జనసేన వర్సెస్ ముద్రగడ..పవన్‌ని తిడితే లేఖ ఏది? వైసీపీలో సీట్ల కోసం!

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు వైసీపీ వర్సెస్ టి‌డి‌పి అన్నట్లుగా పోరు జరుగుతూనే ఉంది. అదే సమయంలో వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్ కల్యాణ్..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు సైతం పవన్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు పోరు మారింది. ఇదే సమయంలో తాజాగా కాకినాడలో మీటింగ్ పెట్టిన పవన్..అక్కడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు.

ద్వారంపూడి..కాకినాడని డ్రగ్స్ డెన్ గా మార్చారని, అక్రమ బియ్యం ఎగుమతులు చేస్తున్నారని, భూ కబ్జాలు చేస్తున్నారని, 15 వేల కోట్ల అక్రమంగా సంపాదించరాని, తాము అధికారంలోకి వచ్చాక ద్వారంపూడిని రోడ్డుకు ఈడుస్తామని, తగిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఇక పవన్‌కు ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం సైతం…పవన్ టార్గెట్ గా లేఖ రాశారు.

బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్ధతు ఇవ్వాలని.. తనను సీఎంని చేయాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలని పవన్ కు ముద్రగడ కౌంటర్ ఇచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని అన్నారు.

ద్వారంపూడి ఫ్యామిలీ గౌరవమైన కుటుంబమని. వారి ఫ్యామిలీ అక్రమంగా సంపాదించిందని అనడం కరెక్ట్ కాదని, పవన్ ఓ వీధి రౌడీలా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. ఇదే క్రమంలో ముద్రగడకు జనసేన నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.గతంలో ద్వారంపూడి…పవన్‌ని దారుణంగా బూతులు తిట్టినప్పుడు ముద్రగడ ఎందుకు లేఖ రాయలేదని, జనసేన శ్రేణులపై ద్వారంపూడి అనుచరులు దాడులు చేసినప్పుడు ఎందుకు లేఖ రాయలేదని, గతంలో కాపు రిజర్వేషన్లు అంటూ హడావిడి చేసి..జగన్ ప్రభుత్వంలో ఎందుకు సైలెంట్ అయ్యారని నిలదీశారు.

వైసీపీలో చేరడానికి తనకు ఎంపీ సీటు, తన కుమారుడుకు ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడానికి ముద్రగడ..రెడ్డి గారి పాలేరు మాదిరిగా మారిపోయారని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news