ఆ నియోజకవర్గంలో వైసీపీ వరుస ఓటములకు కారణం ఇదేనా

-

రాజకీయాల్లో కలుపుకుని పోతే బలం. విడిపోతే విభేదాలు. అనవసర అపార్థాలు. ఈ సూత్రం తెలుసుకున్న వారు అందరినీ కలుపుకుని బలం పెంచుకుంటాడు. తెలియని వాడు ఎవరి దారిన వారిని వదిలేసి బలం కోల్పోతాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే ఏర్పడింది ఆ నియోజకవర్గంలో. పార్టీకి రాష్ట్రమంతా అంత వేవ్ కొనసాగినప్పుడు కూడా ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి గెలవలేకపోవడానికి అంతర్గత విబేదాలే కారణమని గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం టీడీపీకీ బాగా బలం ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో మరింత గట్టిగా పనిచేయాల్సిన వైసీపీ క్యాడర్ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ ఉన్న పాత నేతకు ,కొత్త నేతకు మధ్య వచ్చిన గ్యాప్ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. వైయస్సార్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సర్రాజు, కొత్త ఇన్ చార్జ్ నరసింహ రాజు కు అస్సలు పడడం లేదంట. 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సర్రాజు ఉండి నియోజకవర్గంలో చాలా పాత నాయకుడు. 2009లో ఓడిపోయాడు. తరువాత వైసీపీలోకి వచ్చిన ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే 2019లో పార్టీకి మంచి ఊపు ఉండడంతో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలుస్తారనుకున్నాడు. అయితే వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆ నియోజకవర్గంలో పార్టీకి మళ్లీ నష్టం చేసింది.

అప్పటి వరకూ వ్యాపారాలలో ఉన్న నరసింహారాజును వైసీపీలోకి తెచ్చుకుని 2019లో టికెట్టు ఇచ్చారు. పలితాలు మాత్రం వ్యతిరేకంగానే వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరికి పొగసడం లేదు. నరసింహా రాజు టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుండడంతో చాలా కాలం నుంచి పార్టీలో ఉన్న నాయకులు గుర్రుగా ఉన్నారంటా సర్రాజు.అధిష్టానం ఆదేశాల ప్రకారం పైకి కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా వారి వర్గాలు మాత్రం వేరు వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చాలా కాలంగా పార్టీలో ఉన్న తనకు ప్రాదాన్యత ఇవ్వకుండా కొత్తగా వచ్చిన నరసింహరాజుకు ప్రాదాన్యత ఇవ్వడం పట్ల సర్రాజు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంట.ఈ నేపథ్యంలో నే వైసీపీ లోకల్ నాయకుల తో విడిగా పాదయాత్ర లు చేయించారు అనే టాక్ నడుస్తుంది.

వీరి మద్య సయోద్య కుదర్చడానికి గతంలో నాయకులు ప్రయత్నం చేసినప్పటికీ అవి పలితాలు ఇవ్వటం లేదంటా. దీంతో అక్కడపార్టీకి తీవ్ర నష్టంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందని కింది స్థాయి క్యాడర్ బాదపడిపోతుందట.

Read more RELATED
Recommended to you

Latest news