BREAKING: ఏపీకి రూ.50,474 కోట్ల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.50,474 కోట్ల మేర లబ్ది చేకూర్చామని తాజాగా కేంద్ర మంత్రి మురుగన్ ప్రకటన చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి మురుగన్…అనంతరం కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్దిని వివరించారు మురుగున్.
కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించామని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం…2047లో భారత్ గ్లోబల్ లీడరుగా అవతరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్టులో ఏపీకి, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చామని… దేశాభివృద్ధికి ఏపీ తొడ్పాటు ఇస్తుందని తెలిపారు. ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్థిక చేయూత ఇచ్చే క్రమంలో అమరావతికి రూ. 15 వేల కోట్ల మేర నిధులు కేంద్రం ఇప్పించనుందని వివరించారు.