సీఎం జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్ పై దాడి చేసింది నేనే అంటూ ఒప్పుకున్నాడు మైనర్ సతీష్. ఇటీవలే సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో పోలీసుల ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే దాంట్లో ఒక మైనర్ నేనే సీఎం జగన్ పై దాడి చేసానని ఒప్పుకున్నాడు. ఇక అటు యువకులను అరెస్ట్ చేయటంతో ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. అన్యాయంగా తమ కుర్రాళ్లను అరెస్ట్ చేశారని..పోలీసులపై ఫైర్ అవుతున్నారు తల్లిదండ్రులు.