విశాఖ హనీట్రాప్ కేసులో కస్టడీ లోకి తీసుకున్న జెమిమా నుండి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే జెమిమా కు చెందిన మిగతా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ మొబైల్స్ లో కీలక వ్యక్తుల డేటా లభ్యం అయినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తుల వివరాలు గొప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఈ కేసులో జెమిమా కోసం కోర్టులో 3 రోజులు కస్టడీ కోరి 2 రోజులకే విచారణ ముగించారు పోలీసులు.
అయితే జెమిమాను మీడియా వద్ద నోరు తెరవనీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె మాట్లాడితే వ్యక్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని పోలీసులు చేసారు. ఇక జెమిమాకు వైద్య పరీక్షలు నిర్వహించకుండా పోలీస్ వెహికల్ లో తిప్పుతున్న వైనం కనిపిస్తుంది. మీడియాను చూసి కేజీహెచ్ వద్ద నుండి జెమిమాతో వెను దిరిగారు కంచరపాలెం పోలీసులు. అయితే ఈ హనీ ట్రాప్ ముఠా సభ్యుల్లో డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఉంటాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.