కర్నూలులో యురేనియం తవ్వకాలు…ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్‌కు రంగం సిద్ధం!

-

కర్నూలులో యురేనియం తవ్వకాలు ప్రారంభం అవుతున్నాయని సమాచారం. అయితే… కర్నూలులోని కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసనకు తెలపకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే… ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కప్పట్రాళ్ల వెళ్లకుండా అరెస్టుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Uranium mining in Kurnool The stage is set for the arrest of Aluru MLA Virupakshi

ఎమ్మెల్యే విరుపాక్షి కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టారు. ఇక అటు కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టుకు భారీగా తరలి వెళ్తున్నారు సమీప గ్రామాల ప్రజలు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఐక్యమైయ్యాయి గ్రామాలు. వారికి మద్దతుగా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి రంగంలోకి దిగారు. అయితే… పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నారు ఎమ్మెల్యే వీరుపాక్షి. వీరుపాక్షిని అరెస్టు చేయడానికి ఎక్కడికి అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి దీనిపై జగన్ మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news