కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి ఉత్తమ్.
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్. రేషన్ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
కొత్త రేషన్ షాపులు ఇవ్వడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం.. కానీ దాని వల్ల ప్రస్తుతం ఉన్న పాత డీలర్ షాపులపై ప్రభావం పడుతుందన్నారు. బీఆర్ఎస్ హాయాంలో.. కొత్తగా 4 వేలకు తాండాలు కూడా గ్రామా పంచాయతీలు ఏర్పాటు అయ్యాయని వివరించారు.