సీఎం జగన్‌ తో వైవీ సుబ్బారెడ్డి, వెల్లంపల్లి సమావేశం

అసెంబ్లీ శాసనసభ లోని సీఎం ఛాంబర్‌లో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసారు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు. విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం జగన్‌ను ఈ సందర్భంగా ఆహ్వానించారు దేవాదాయశాఖ మంత్రి, టీడీడీ ఛైర్మన్, ఈవో, ఇతర అధికారులు.

అనంతరం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలు అందించారు వేద పండితులు.ఇక అంతకు ముందు..జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ యే కానీ నిజ జీవితంలో రబ్బర్ సింగ్ అంటూ చురకలంటించారు. ఏదో పీకేస్తాం అని డబ్బా డైలాగు చెబుతున్నావు… ఆయనకు అంత దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ త్రివిక్రమ్ రాసిన డైలాగులు అంటూ ఫైర్ అయ్యారు.